పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. దీంతో కొద్దిరోజులుగా దాడులు తగ్గాయి. లెబనాన్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోయాయి. అయితే తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం పర్యవేక్షణకు అమెరికా రంగంలోకి దిగింది. యూఎస్‌కు చెందిన అధికారి బీరుట్‌ను సందర్శించారు. తాజా పరిణామాలపై పర్యవేక్షిస్తు్న్నారు.
ఏడాదికిపైగా పశ్చిమాసియాలో యుద్ధంతో దద్దరిల్లిపోయింది. బాంబు దాడులతో, క్షిపణుల ప్రయోగాలతో అస్తవ్యస్తం అయిపోయింది. అయితే ఇటీవల అమెరికా మధ్యవర్తిగా ఉండి ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. దీంతో ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తుంది. నెమ్మది.. నెమ్మదిగా ఇజ్రాయెల్ దళాలు కూడా వెనక్కి పోతున్నాయి. సంత్సరానికి పైగా జరిగిన యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దళాలు దశలవారీగా ఉపసంహరించుకుంటున్నాయి.
అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఐడీఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఆనాటి నుంచి ఇజ్రాయెల్ దళాలు.. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే గాజా పట్టణం పూర్తిగా ధ్వంసం అయింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. అయితే మధ్యలో హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు తెగబడింది. దీంతో ఐడీఎఫ్ దళాలు.. హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్ దాడులు చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ ఘటన తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై కాలు దువ్వింది. ఒకేసారి 180 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులకు తెగబడింది. ఇరాన్ అణు కేంద్రమే లక్ష్యంగా దాడులు చేసింది. భారీ ఎత్తున ఆయుధ సంపత్తు ధ్వంసం అయినట్లు వార్తలు వినిపించాయి. ఈ పరిస్థితులతో పశ్చిమాసియా అట్టుడికింది. ఎప్పుడు.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దాదాపుగా పరిస్థితులు చక్కబడ్డాయి.