క్రిస్మస్ వేళ ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రయాణికులతో ఎయిర్‌పోర్టులు సందడి.. సందడిగా కిటకిటలాడుతున్న సమయంలో ప్రయాణికులకు షాకిచ్చింది. ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూఎస్‌లో అన్ని విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. దీంతో క్రిస్మస్ ప్రయాణాలు పెట్టుకున్న ప్యాసింజర్స్ అంతా అయోమయం… గందరగోళానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
క్రిస్మస్ ప్రయాణాలు పెట్టుకున్న ప్రయాణికులకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య కారణంగా సర్వీసులు నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో క్రిస్మస్ ఈవెంట్ కోసం వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే అన్ని విమానాలను ఎందుకు రద్దు చేసిందో మాత్రం కంపెనీ వివరంగా వెల్లడించలేదు. అనేక మంది ప్రయాణికులతో విమానాలు వివిధ విమానాశ్రయాల్లో రన్‌వేపై ఇరుక్కుపోయాయని తెలిపింది. తిరిగి పంపిస్తున్నట్లు మాత్రం పేర్కొంది. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ఎక్స్ ట్విట్టర్‌లో కంపెనీ తెలిపింది.
ఇదిలా ఉంటే హఠాత్తుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తు్న్నారు. దీనిపై కంపెనీ ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: AP New CS: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు?.. సీఎం చంద్రబాబు ఆలోచన ఏంటి?