Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు విక్రయాలు
- 36 ఏళ్ల నిషేధం తర్వాత ఢిల్లీకి ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు
- బహ్రిసన్స్ బుక్‌స్టాల్‌లో ప్రత్యక్షం
- ఇటీవలే కేసును క్లోజ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీకి చెందిన వివాదాస్పద నవల ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు దాదాపు 36 ఏళ్ల నిషేధం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని బహ్రిసన్స్ బుక్‌స్టాల్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ వివాదాస్పద నవలను రాజీవ్ గాంధీ ప్రభుత్వం అక్టోబర్ 5, 1988లో పుస్తకం దిగుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ కేసును ఢిల్లీ హైకోర్టు క్లోజ్ చేసింది. దీంతో తిరిగి 37 ఏళ్ల తర్వాత ఈ పుస్తకం హస్తినలో దర్శనమిచ్చింది. కేవలం లిమిటెడ్ స్థాయిలో ప్రదర్శనలో ఉంచారు.
ది సైటానిక్ వెర్సెస్ నవల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రచయిత రష్దీపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ముస్లింలు వ్యతిరేకించిన ప్రవచనాలను బయటపెట్టినందుకు సల్మాన్ రష్దీ హత్యకు ఫత్వా జారీ అయింది. 1989లో ఇరాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు అయాతొల్లాహ్ ఖొమెయినీ.. సల్మాన్ రష్దీని హత్య చేయాలని ఫత్వా జారీ చేశారు. అంతేకాదు ఈ నవలను జపాన్ భాషలోకి అనువదిందిన హితోషి ఇగరాషిని జూలై 1991లో పొడిచి చంపారు. ఇటాలియన్ అనువాదకుడు ఎట్టోర్ కాప్రియోలో కత్తి పోట్లకి గురై బతికి బయట పడ్డాడు. 1993 అక్టోబరులో నవల పబ్లిషర్ విలియం నైగార్డ్ పైన హత్యా ప్రయత్నం చేశారు. 1993 జూలై 2న టర్కిష్ అనువాదకుడు అజీజ్ నేసిన్ కత్తిపోట్లకి గురై బతికాడు. ఇక ఈ నవలను ఇండియాతో పాటు చాలా ఇస్లామిక్ దేశాల్లో నిషేధించారు.
Also Read
నవల దిగుమతిపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నవంబర్‌లో విచారణను ముగించింది. దీనిపై ప్రభుత్వ అధికారులు సరైన వాదనలు వినిపించకపోవడంతో ఈ కేసును న్యాయస్థానం క్లోజ్ చేసింది. దీంతో పుస్తకాల విక్రయాలకు తిరిగి మార్గం సుగమం అయింది. మొత్తానికి 37 ఏళ్ల తర్వాత రష్దీ పుస్తకాలు విక్రయాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!