దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ఆప్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. కేజ్రీవాల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు.
జర్మనీ పార్లమెంట్ రద్దైంది. జర్మనీ పార్లమెంట్‌ను అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ రద్దు చేశారు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేశారు.
పెళ్లంటేనే సందడి.. హడావుడి ఉంటుంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రాకతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారు. సామాన్యులు చేసుకున్నా.. భాగ్యవంతులు చేసుకున్నా.. సందడి ఏ మాత్రం తగ్గదు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్లు వివాహ ఏర్పాట్లు చేసుకుంటారు.
అమెరికా వీసాల్లో రికార్డ్ సృష్టించింది. వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
క్రిస్మస్ రోజున పార్లమెంట్ భవనం సమీపంలో ఆత్మాహత్యాయత్నం చేసిన 26 ఏళ్ల జితేంద్ర అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రిలో చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వయో భారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆర్థిక వేత్తగా మన్మోహన్ అనుసరించిన విధానాలను నేతలు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ప్రముఖులు నివాళులర్పించారు.