Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ
- గురుగ్రామ్‌లో దారుణం
- బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్
- రూ.80 లక్షలు అపహరణ.. ముగ్గురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ బాలిక ప్రైవేట్ ఫొటోలు కొందరి చేతుల్లోకి వెళ్లాయి. ఇంకేముంది వారికి అస్త్రంగా మారింది. అసభ్యకరమైన ఫొటోలను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. డబ్బు డిమాండ్ చేసినప్పుడల్లా సమర్పించుకుంటూ వచ్చింది. ఇలా దఫదఫాలుగా రూ.80 లక్షలు సమర్పించుకుంది. కుటుంబ సభ్యుల అప్రమత్తత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.
గురుగ్రామ్ స్కూల్‌లో చదువుతున్న బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్యూషన్ క్లాస్‌లో విద్యార్థి బెదిరింపులకు దిగాడు. అతడితో మరో ఇద్దరు కలిసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు బదిలీ చేసింది. ఫిబ్రవరి, 2024 నుంచి ఇలా దఫదఫాలుగా రూ.80లక్షల వరకు పంపించింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అయితే ఇటీవల కుటుంబ సభ్యులు.. అకౌంట్‌లో రూ.80లక్షలు మాయం కావడంతో కంగారు పడ్డారు. భూమి అమ్మగా ఆ డబ్బు వచ్చింది. అయితే అమ్మమ్మ నిరక్షరాసులు. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనవరాలు.. డబ్బులు పంపించింది. డబ్బులు మాయం కావడంతో అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో తండ్రి పనిచేసే ఒక ప్రైవేట్ పాఠశాలలోనే బాలిక చదువుతోంది. బాలికను నిందితులు బ్లాక్ మెయిల్ చేశారని, ఆమె ప్రైవేట్ ఫోటోలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తామని బెదిరించారని తెలిసింది. డబ్బులు మాయం కావడం అమ్మమ్మ మనవరాలితో గొడవ పడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు.. డిసెంబర్ 21న పోక్సో చట్టం, బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోన్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి హయత్‌పూర్, మహేంద్రగఢ్‌కు చెందిన ప్రైవేట్ కార్మికుడు కుశాల్ (22), కాలేజీ విద్యార్థి సుమిత్ కటారియా (20), నిరుద్యోగ యువకుడు సుమిత్ తన్వర్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. దోపిడీ చేసిన డబ్బును రికవరీ చేయడం మరియు నేరంతో సంబంధం ఉన్న అదనపు వ్యక్తులను గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?