యూపీఎస్సీ అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన పర్సనాలిటీ టెస్ట్ ఫిబ్రవరి 8కు మార్చబడినట్లు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో అధ్యక్షుడు బైడెన్ దంపతుల సహా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, మాజీ అధ్యక్షుల కుటుంబాలు హాజరయ్యారు.
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్లను తీసుకొస్తున్నాయి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.
రాబోయే రెండు సంవత్సరాల్లో 50 అమృత్ భారత్ రైళ్లను అధునాతన ఫీచర్లతో తయారు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ రైళ్లలో మెరుగుపరిచిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను అశ్విని వైష్ణవ్ పంచుకున్నారు.
ఐఏఎస్.. దేశంలో అత్యంత పవర్ఫుల్ ఉద్యోగం. ఎంతో టాలెంట్ ఉంటేనే గానీ.. ఈ ఉద్యోగం సాధించలేరు. ఎంతో ఉన్నంతంగా ఉండాల్సిన బ్యూరోక్రాట్లు దారి తప్పారు. ప్రభుత్వ ఆగ్రహంతో సస్పెన్స్‌కు గురయ్యారు. ఇంతకీ వారిద్దరూ ఎవరు? వాళ్లు చేసిన పనేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా-ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం సాగుతోంది. గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా.. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్నారు.