Chhattisgarh: రాయ్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందంటే..!
- ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో విషాదం
- బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- సూసైడ్ నోట్‌లో కారణాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు నోట్‌లో అన్ని విషయాలు రాసి ప్రాణాలు తీసుకుంది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: Modi-New Zealand: న్యూజిలాండ్ ప్రధానితో మోడీ సంభాషణ.. కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ప్రిన్సీ కుమారి(20) .. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నివాసి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. పుంజిపాత్ర సమీపంలోని విశ్వవిద్యాలయ హాస్టల్‌లో నివసిస్తోంది. శనివారం రాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా ఒక సూసైడ్ నోట్‌ను రాసింది. ‘‘క్షమించండి అమ్మా, నాన్న’’. మీ అంచనాలను అందుకోలేపోతున్నా.. పరీక్షల ఒత్తిడి భరించలేకపోతున్నట్లు వాపోయింది. నా చదువు కారణంగా కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలో తిరిగి ల్యాండ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్టల్ అధికారుల అప్రమత్తం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. విద్యార్థిని రెండవ సంవత్సరం పరీక్షలకు మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్ పేపర్లతో పాటు హాజరు కావాల్సి ఉన్నందున చదువులో ఒత్తిడికి గురైందని తెలుస్తోంది. పోలీసులు గది నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు.పోస్ట్ మార్టం నివేదిక తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
ప్రిన్సీ కుటుంబం.. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పదే పదే కాల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఫోన్‌కు సమాధానం రాలేదు. ఏదో జరుగుతోందని భయపడి.. హాస్టల్ వార్డెన్‌ను సంప్రదించారు. వార్డెన్ గదికి చేరుకున్నప్పుడు తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. పదే పదే తలుపు తట్టినప్పటికీ స్పందన లేదు. వార్డెన్ కిటికీ గుండా చూడగా ఉరి వేసుకుని కనిపించింది.
ప్రిన్సీకి మొదటి సెమిస్టర్‌లో ఐదు సబ్జెక్టులలో బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని.. తిరిగి పరీక్షలకు సిద్ధమవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల సెమిస్టర్ ఫీజుల కోసం వాయిదాల రూపంలో దాదాపు లక్ష రూపాయలు అడిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!