హిందీ జాతీయ భాష కాదంటూ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. మధురైలో అన్నామలై మీడియాతో మాట్లాడుతుండగా అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. పైవిధంగా స్పందించారు. స్నేహితుడు అశ్విన్ చెప్పాల్సిన విషయమే చెప్పాడని.. హిందీ జాతీయ భాష కాదన్నారు. కేవలం లింక్ లాంగ్వేజ్ మాత్రమేనని. సౌలభ్యం కోసమే భాష ఉందని తెలిపారు. అశ్విన్ ఏం చెప్పాడో.. తాను కూడా అదే చెబుతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: పేదలకు మేలు చేయాలని పథకాల అమలుకు నిర్ణయం..
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్యోలు పలికిన టీమిండియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు విద్యార్థులతో మాట్లాడుతూ.. ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు ఎంతమందికి అర్థమవుతున్నాయని అడిగారు. హిందీ గురించి అడగ్గా కొందరి నుంచి మాత్రమే ఆన్సర్ వచ్చింది. దీంతో అతడు ఇక్కడ మీకో ముచ్చట చెప్పాలి.. హిందీ అధికారిక భాష మాత్రమే.. జాతీయ భాష కాదని తెలిపారు.
#WATCH | Madurai: On cricketer Ravichandran Ashwin's "Hindi not our national language" statement, Tamil Nadu BJP president K Annamalai says, "Correct. It is not our national language which Annamalai is also telling you. Not only my dear friend Ashwin has to say that…It is not… pic.twitter.com/hddBuznvy8
— ANI (@ANI) January 10, 2025
#WATCH | Madurai: Tamil Nadu BJP president K Annamalai says, "…We all know the State Govt had written a letter in February 2024 wherein the State Govt had never objected to this block being auctioned by the Central Govt. So, accordingly the Central Govt called for a tender and… pic.twitter.com/545cBrb1Rl
— ANI (@ANI) January 10, 2025