టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఫ్రాడ్ చేస్తూ అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఈజీమనికి అలవాటు పడి సరికొత్త ఎత్తుగడలతో మోసం చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) సీఈవో విదేహ్ కుమార్ జైపురియార్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ముంగేలిలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి తొక్కిసలాట ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలోని పటేల్ నగర్ ప్రాంతంలోని కావెంటర్స్ షాపును సందర్శించారు. రాహుల్ రాకతో సిబ్బంది ఆహ్వానించారు. కాఫీ ఇవ్వాలని సిబ్బంది అడిగగా.. రాహులే స్వయంగా తయారు చేసుకుని ఆస్వాదించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించాలని విన్నవించారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు తేజస్వీ ఈ విధంగా స్పందించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రష్యా జరిపిన భీకరదాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. తాజాగా ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా దాడులను ఎదుర్కొంటోంది.
తిరుపతి విష్ణు నివాసం దగ్గర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరగడంతో ఒక భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది.