ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని్కల్లో అధికార పార్టీ ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్‌గా దాడి చేస్తోంది.
అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ భారీగా పడిపోతుంది. ఈ మధ్య కాలంలో బాగా పతనం అయింది. దీంతో ప్రధాని మోడీని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట డిజిటల్ అరెస్ట్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి.. అమాయకుల బలహీనతను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగి లక్షల్లో.. కోట్లలో నగదు కాజేస్తున్నారు. అనంతరం బాధితులు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లోని నిర్మాణంలో ఉన్న భాగం కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న 35 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
ఇండియా కూటమి దాదాపుగా చీలిపోయినట్లుగానే తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ పాలసీ వ్యవహారం తాజాగా మరోసారి కాక రేపుతోంది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా హస్తినలో గాలి నాణ్యత మరింత క్షీణించినట్లుగా తెలిపింది.