ఐఏఎస్.. దేశంలో అత్యంత పవర్‌ఫుల్ ఉద్యోగం. ఎంతో టాలెంట్ ఉంటేనే గానీ.. ఈ ఉద్యోగం సాధించలేరు. ఎంతో ఉన్నంతంగా ఉండాల్సిన బ్యూరోక్రాట్లు దారి తప్పారు. ప్రభుత్వ ఆగ్రహంతో సస్పెన్స్‌కు గురయ్యారు. ఇంతకీ వారిద్దరూ ఎవరు? వాళ్లు చేసిన పనేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌కి ‘‘జాక్‌పాట్’’ తగిలింది.. సింధునదిలో భారీగా బంగారు నిల్వలు..
కేరళను హిందూ, ముస్లిం వాట్సాప్ గ్రూపులు తీవ్ర దుమారం రేపాయి. చివరికి ఇద్దరు బ్యూరోక్రాట్లు సస్పెండ్‌కు గురయ్యారు. తాజాగా ఒకరిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తేయగా.. ఇంకొకరిపై కొనసాగించింది. గోపాలకృష్ణన్, ప్రశాంత్ ఇద్దరూ ఐఏఎస్‌లు. అయితే హిందూ, ముస్లింకు సంబంధించిన మత సంబంధంమైన వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి.. పోకిరీ చేష్టలకు పాల్పడ్డారు. మతపరమైన వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారనే ఆరోపణలపై గత నవంబర్‌లో ఐఏఎస్ అధికారి కె గోపాలకృష్ణన్ సస్పెండ్‌కు గురయ్యారు. తాజాగా తదుపరి క్రమశిక్షణా చర్య పెండింగ్‌లో ఉన్నందున గోపాలకృష్ణన్‌ను తిరిగి కేరళ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకుంది. అయితే సీనియర్ అధికారిపై వాట్సప్ గ్రూప్‌లో విమర్శలు చేసిన ప్రశాంత్‌పై మాత్రం సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సస్పెన్షన్ రివ్యూ కమిటీ సూచనల మేరకు కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: KTR Meets KCR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..
గోపాలకృష్ణన్ సస్పెన్షన్ కొనసాగించడానికి ప్రాథమిక కారణం నిర్ధారణ కాలేదని సస్పెన్షన్ రివ్యూ కమిటీ తెలిపింది. దీంతో అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకుంది. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణన్ జనవరి 9న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అతనిపై క్రమశిక్షణా చర్యలను ఖరారు చేసే వరకు సస్పెన్షన్‌ను పెండింగ్‌లో ఉంచింది. ఇక వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమ శాఖలో పని చేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఎన్ ప్రశాంత్ సస్పెన్షన్ మాత్రం జనవరి 10 నుంచి మరో 120 రోజులు పొడిగించింది. ప్రశాంత్.. కేరళలో ‘కలెక్టర్ బ్రో’గా ప్రసిద్ధి చెందారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జయతిలక్‌పై నిరాధారమైన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా చేసి సస్పెండ్‌కు గురయ్యారు. ఆయన సస్పెన్షన్‌ను పొడిగించాలని సస్పెన్షన్ రివ్యూ కమిటీ సిఫార్సు చేయగా.. ప్రభుత్వం ఆమోదించింది.
గోపాలకృష్ణన్ వివిధ వర్గాలకు చెందిన అధికారులతో కలిసి ‘‘మల్లు హిందూ ఆఫీసర్స్’’ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఇది తీవ్ర వివాదం సృష్టించింది. అయితే తాను గ్రూప్‌లో అధికారులెవరినీ చేర్చుకోలేదని.. గంటల వ్యవధిలోనే దాన్ని తొలగించినట్లు గోపాలకృష్ణన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ప్రశాంత్.. జయతిలక్‌ను మానసిక రోగిగా అభివర్ణించారు. ఇలా ఇద్దరు వివాదంలో ఇరుక్కుని వేటుకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల శిక్ష