స్మార్ట్ ఫోన్ లవర్స్ కు న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్లను తీసుకొస్తున్నాయి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. ఐటెల్ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ itel ZENO 10 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కేవలం రూ. 5,999 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.
పవర్ ఫుల్ బ్యాటరీ కెపాసిటీ, క్రేజీ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. చౌక ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. itel ZENO 10 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 5,999, దీని టాప్ వేరియంట్ రూ. 6,499. ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 3GB + 64GB ను రూ. 5,999 ధరకే అందిస్తోంది. 4GB + 64GB వేరియంట్ ధరను రూ. 6,499 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ రెండు కలర్స్ లో లభిస్తోంది. ఫాంటమ్ క్రిస్టల్ అండ్ ఒపల్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంది.
Itel Zen 10 ఫీచర్ల విషయానికి వస్తే.. 6.56 అంగుళాల HD + IPS డిస్ల్పేను కలిగి ఉంది. ఫోన్ డిస్ల్పేలో డైనమిక్ బార్ ఫీచర్ అందించారు. ఇందులో బ్యాటరీ ఛార్జింగ్, ఇన్ కమింగ్ కాల్స్ మొదలైన నోటిఫికేషన్స్ వివరాలను ఐఫోన్ లాగా చూడొచ్చు. ఈ ఫోన్ ఆక్టాకోర్ చిప్ సెట్ తో వస్తుంది. ఫోన్ ర్యామ్ ను వర్చువల్ గా 8GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ లో వెనుక 8MP AI డ్యూయల్ రియర్ కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ Android 14.0 Go OS పై పనిచేస్తుంది. ఈ ఫోన్ పవర్ బటన్ తో పాటు.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. అదనంగా, ఇది ఫేస్ అన్ లాక్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఐటెల్ కొత్త ఫోన్ 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఈ ఫోన్ కావాలనుకునే వారు అమెజాన్ నుంచి కొనుగోలు చేయొచ్చు.