ఇండియా కూటమిపై సీనియర్ రాజకీయ వేత్త, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కేవలం జాతీయ ఎన్నికల కోసమే ఉందని.. రాష్ట్ర, స్థానిక ఎన్నికల కోసం కాదని.. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు.
బెంగళూరు మెట్రో కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించడానికి ఏఐ, డ్రోన్లు ఉపయోగించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి ఎంజీ రోడ్-బైప్పనహళ్లి సెక్షన్లో మెట్రో నడుస్తోంది.
ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ లాగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తు్న్నారని ధ్వజమెత్తారు.
పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం చోటుచేసుకుంది. థర్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి హాస్టల్కు వచ్చిన తల్లిదండ్రులకు.. కుమారుడు శవమై కనిపించాడు.
పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపింది.
ఆర్థిక వ్యవస్థను బలపరిచే లక్ష్యంతో క్యాసినో చట్టబద్ధం చేసే ముసాయిదా బిల్లును థాయ్లాండ్ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. దీంతో బాక్సింగ్, గుర్రపు పందాలపై బెట్టింగ్ వంటి కొన్ని రకాల జూదానికి అనుమతి లభించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో నోట్ల కట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. డిసెంబర్ 6న కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్ల ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో తీవ్ర అలజడి చెలరేగింది.
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 5న ఆప్ విపత్తు పోతుందని జోస్యం చెప్పారు. శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో జరిగిన ‘‘జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్’’ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని కేజ్రీవాల్ లక్ష్యంగా ధ్వజమెత్తారు.