Suresh Maddala
Author- NTV Telugu-
Himachal Pradesh: ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. అతిథులు కన్నీటిపర్యంతం
హిమాచల్‌ప్రదేశ్‌లో భారతీయ సైనికులు ఒక గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు. ఒక వీరుడి సోదరి వివాహం కోసం సైనికులంతా కదిలివచ్చారు. దేశం కోసం వీరమరణం పొందిన ఒక సైనికుడి సోదరి వివాహాన్ని దగ్గరుండి గ్రాండ్‌గా నిర్వహించారు. దీంతో పెళ్లికొచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. -
Stalin: కరూర్‌ను ఒకలా.. మణిపూర్‌ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం
బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరూర్ ఘటనను బీజేపీ వాడుకుంటోంది తప్ప.. తొక్కిసలాట గురించి మాత్రం ఆందోళన లేదని వ్యాఖ్యానించారు. -
UP: సినిమా రేంజ్లో కాల్పులు.. హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సినిమా తరహాలో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. స్నేహితుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అనంతరం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Scuba Diving: స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. ఎలాగంటే..!
ఓ ఆపిల్ వాచ్.. ప్రమాదం నుంచి ముంబై టెక్కీ ప్రాణాలు కాపాడింది. ఇది వాస్తవం. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించింది. ఎలా? ఏంటి? తెలియాలంటే ఈ వార్త చదవండి. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో కో-సింగర్ అమృత్ప్రవ అరెస్ట్.. ఆమె ఫోన్లో ఏముందంటే..!
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే జుబీన్ గార్గ్ మేనేజర్, ఉత్సవ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్య కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Udit Raj: ఆర్ఎస్ఎస్ ఉగ్ర సంస్థ.. మోడీ ఆధునిక రావణుడు.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ ఆధునిక రావణుడికి చిహ్నం అని తెలిపారు. ప్రధాని మోడీ ఎక్కువ కాలం కొనసాగలేరని.. త్వరలోనే ఆయన లంకలో అగ్నిప్రమాదం జరుగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
Karnataka: కర్ణాటకలో దారుణం.. 12 ఏళ్ల కుమార్తెను చంపి తల్లి ఏం చేసిందంటే..!
కర్ణాటకలో ఓ తల్లి ఘాతుకానికి పాల్పడింది. నవమాసాలు మోసి కని పెంచిన కన్నబిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘోరం శివమొగ్గలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ మేనేజర్, నిర్వాహకుడిపై మర్డర్ కేసు నమోదు
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్కాను మహంతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తు బృందం 14 రోజుల కస్టడీకి తీసుకుంది. సిద్ధార్థ శర్మ, శ్యామ్కాను మహంతలపై హత్యా అభియోగాలు నమోదయ్యాయని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. -
MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడి పోయింది. దీంతో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. -
Delhi Baba Horror: అమ్మాయి నచ్చితే ప్రత్యేక గది.. ఖరీదైన సెల్ఫోన్లు.. వెలుగులోకి ఢిల్లీ బాబా దురాగతాలు
ఢిల్లీ బాబా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2016లో చదివిన ఓ మాజీ విద్యార్థి సంచలన విషయాలు బయటపెట్టాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ చైతన్యానందకు అమ్మాయి నచ్చితే చాలు అదనపు సౌకర్యాలతో ప్రత్యేక గది లభించేదని తెలిపాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!