ముంబైలో మహిళపై అత్యాచార ఘటనలో ఇప్పటికే ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తాజాగా ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చాయి.
ఆటోడ్రైవర్ తనపై అత్యాచారం చేశాడంటూ మహిళ ఫిర్యాదుతో నిందితుడ్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేటు భాగాల్లో రాళ్లు, సర్జికల్ బ్లేడ్ పెట్టినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Republic Day Celebrations: భారత గణతంత్ర దినోత్సవ వేడుకకు అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి(20) ఆటో డ్రైవర్‌తో రాత్రి గడపాలని అనుకుంది. దీంతో ఆమె ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్నాలా బీచ్‌కు మంగళవారం వెళ్లారు. ఐడీ ఫ్రూ లేకపోవడంతో హోటల్‌లో గది దొరకలేదు. దీంతో రాత్రి బీచ్‌లోనే గడిపారు. ఆ సమయంలో యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లుగా సమాచారం. అయితే ఆటోడ్రైవర్ వెంటనే సంఘటనాస్థలి నుంచి పారిపోయాడు. అనంతరం యువతి కూడా నాలాసోపరాలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి యువతి ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులకు భయపడి ఆమె నాటకానికి తెరలేపింది. శస్త్రచికిత్స కోసం ఉపయోగించే బ్లేడ్, రాళ్లు ప్రైవేటు భాగంలో పెట్టుకుందని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసుల దగ్గరకు వచ్చి అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు చేసిందని చెప్పారు. నొప్పి, రక్తస్రావం జరగడంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు.. ప్రైవేటు భాగంలోంచి వస్తువులన్నీ ఇబ్బంది లేకుండా బయటకు తీశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Naga Vamsi: హీరోగా వైరల్ ప్రొడ్యూసర్ బామ్మర్ది..
ప్రాణాలతో బయటపడిన యువతి.. తాను అనాథనని.. వారణాసిలో తన మామతో కలిసి ఉంటున్నట్లు పోలీసులకు తెలిపింది. ఆదివారమే ముంబైకి వచ్చినట్లు చెప్పింది. అయితే యువతి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.