ఐఏఎస్ అవతారమెత్తి మోసాలకు పాల్పడుతున్న నకిలీ ట్రైనీ ఐఏఎస్ అమృత భాగ్య రేఖను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై విశాఖ కంచరపాలెంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఆమె జాడను కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర.. కేంద్రం, పోలీసులపై ఆప్ తీవ్ర ఆరోపణలు
అమృత భాగ్య రేఖపై విశాఖలోని పలు స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె నకిలీ ఐఏఎస్‌గా గుర్తించి గాలింపు చేపట్టగా ప్రకాశం జిల్లాలో దొరికింది. ఇక ఆమె భర్త బెయిల్‌పై బయట తిరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Vijaysai Reddy: రాజకీయాలకు గుడ్ బై.. కీలక ప్రకటన