దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. మంటలను ఆర్పేశారు. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటకు దించేశారు. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరు సాగుతోంది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు.
క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఏవైనా పతకాలు సాధించినప్పుడు ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహం మరింత ఉత్తేజపరుస్తాయి. ఇలా ఆయా రకాలైన ఆటల్లో చూస్తుంటాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అతిషికి భారీ ఊరట లభించింది. అతిషిపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పురువు నష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
మహా కుంభమేళాలో వింతలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 15 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించి రికార్డ్ సృష్టించారు.
ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యా్న్ని కంట్రోల్ చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాలు రద్దు చేయాలని ఫడ్నవిస్ ప్రభుత్వం భావిస్తోంది.
శ్రీలంక నేవీ దుందుడుకుగా ప్రవర్తించింది. భారతీయ మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ‘డీప్‌సీక్’పై సైబర్ దాడి జరిగినా.. అలాగే అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా మన మార్కెట్ గ్రీన్‌లో కొనసాగాయి.