బెంగళూరులో దారుణం జరిగింది. బంగ్లాదేశ్ మహిళ హత్యకు గురైంది. అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కల్కెరే కాలువలో పడేశారు. పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత కింద హత్య, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: K.A.Paul: మరో సంవత్సరంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు.. సంచలన వ్యాఖ్యలు
బెంగళూరులోని రామమూర్తి నగర్‌లోని కల్కెరే చెరువులో 28 ఏళ్ల బంగ్లాదేశ్ మహిళ మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో పని మనిషిగా పని చేస్తోంది. అయితే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడి.. అనంతరం బండకరాయితో కొట్టి చంపి కాలువలో పడేసినట్లుగా పోలీస్ అధికారులు తెలిపారు. కల్కెరేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె పనిమనిషిగా పనిచేసినట్లు సీనియర్ పోలీసు కార్యాలయం తెలిపింది. అత్యాచారం చేశాక.. బండరాయితో కొట్టి చంపినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. భారతీయ న్యాయ సంహితపై హత్య, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Dear Krishna Review: డియర్ కృష్ణ రివ్యూ