మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను చంపేందుకు కేంద్రం, ఢిల్లీ పోలీసులు కుట్రపన్నారని ఆప్ ముఖ్యమంత్రులు అతిషి, భగవంత్ మాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రులిద్దరూ మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు… అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పంజాబ్ పోలీసులు కేజ్రీవాల్‌కు అందించిన భద్రతను ఉపసంహరించుకున్న తర్వాత ఈ ఆరోపణలు వెళ్లువెత్తాయి.
ఇది కూడా చదవండి: Supreme Court : నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌పై జరిగిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. తమ నాయకుడికి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్‌కు పంజాబ్ పోలీసుల భద్రత కల్పిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు, భారత ఎన్నికల సంఘం జోక్యంతో పంజాబ్ పోలీసులు భద్రతను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులు.. దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నా కళ్లు మూసుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌కు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ లేఖ రాసిందని అతిషి తెలిపారు. అయినా అమిత్ షా ఆధీనంలో ఉన్న ఢిల్లీ పోలీసులపై తమకు నమ్మకం లేదని అతిషి అన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court : నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ ర్యాలీలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఇలా పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు భద్రత పెంచాలని ఈసీకి ఆప్ లేఖలు రాసింది. ఇంతలోనే పంజాబ్ పోలీసులు.. కేజ్రీవాల్‌కు భద్రత కల్పించారు. అయితే ఈసీ ఆదేశాలతో భద్రతను ఉపసంహరించుకున్నట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక ప్రస్తుత ప్రభుత్వ కాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది.
केजरीवाल जी को ख़त्म करना चाहती है BJP‼️
“क्या देश में आजतक कभी ऐसा हुआ है कि जिसे Z+ सुरक्षा मिली हो और उसके ऊपर बार-बार हमला किया गया हो और पुलिस सामने तक ना आए, हमलावरों को पकड़ा तक ना जाए?
BJP और अमित शाह किसी भी तरह से अरविंद केजरीवाल जी को ख़त्म करना चाहते हैं।”… pic.twitter.com/4B0hrHbaY4
— AAP (@AamAadmiParty) January 24, 2025
अरविंद केजरीवाल जी को जान से मारने की रची जा रही साज़िश‼️
♦️ इस साजिश में एक खिलाड़ी बीजेपी के कार्यकर्ता हैं, जो अरविंद केजरीवाल जी के ऊपर हमला करते हैं
♦️ वहीं दूसरी खिलाड़ी BJP और अमित शाह के अंतर्गत आने वाली दिल्ली पुलिस है @AtishiAAP pic.twitter.com/uxwCnS5Mra
— AAP (@AamAadmiParty) January 24, 2025