Karnataka: సీఎం సిద్ధరామయ్యకు అవమానం.. రివార్డ్ తిరస్కరించిన ఖో ఖో ప్లేయర్స్
- సీఎం సిద్ధరామయ్యకు అవమానం
- రివార్డ్ తిరస్కరించిన ఖో ఖో ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఏవైనా పతకాలు సాధించినప్పుడు ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహం మరింత ఉత్తేజపరుస్తాయి. ఇలా ఆయా రకాలైన ఆటల్లో చూస్తుంటాం. అలాంటిది కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన బహుమతి విమర్శలకు దారి తీసింది. ఇద్దరు ఆటగాళ్లు నగదు బహుమతిని తిరస్కరించారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి తీవ్ర అవమానం జరిగినట్లైంది.
ఎంకే. గౌతమ్, చైత్ర బి… ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన పురుషులు, మహిళల జట్లలో భాగంగా ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. అయితే ఈ నగదు అవమానంగా భావించారు. అంతే ప్రభుత్వం ప్రకటించిన రివార్డ్‌ను క్రీడాకారులిద్దరూ తిరస్కరించారు. అయితే తాము నగదు తిరస్కరించడం వల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అగౌరవపరచడం లేదన్నారు. కానీ మాకు తగిన గౌరవం లభించలేదని గౌతమ్ అన్నారు. మహారాష్ట్రలో తమ ఆటగాళ్లకు మెరుగైన మద్దతు ఇచ్చిందని ఆటగాళ్ళు గుర్తుచేశారు. గౌతమ్‌తో పాటు చైత్ర కూడా ప్రభుత్వ స్పందన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇతర ప్రపంచకప్ ఆటగాళ్లకు ఇచ్చే మొత్తాన్ని మేం డిమాండ్ చేస్తున్నామని, ఇతర క్రీడాకారుల మాదిరిగానే మనకు కూడా పతకాలు వచ్చాయి. అయితే క్రీడాకారులకు వివిధ ఆటలకు ఇచ్చే సౌకర్యాలను కోల్పోతున్నామని ఆమె అన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?
ఇదిలా ఉంటే ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన మహారాష్ట్ర క్రీడాకారులకు అక్కడి ప్రభుత్వం రూ.2.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యోగాలను కూడా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం.. క్రీడాకారులను ఉన్నతంగా గౌరవిస్తే.. కర్ణాటక ప్రభుత్వం తమను చిన్నచూపు చూసినట్లుగా క్రీడాకారులు భావించారు. దీంతో బహుమతిని తిరస్కరించారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. క్రీడాకారులను సత్కరించి, వారి విజయాలను ప్రశంసించినప్పటికీ.. గౌతమ్, చైత్ర మాత్రం గౌరవం సరిపోదని భావించారు. నగదు బహుమతి తమను క్రీడలో కొనసాగేందుకు ప్రోత్సహించదని, ఖో ఖోను కొనసాగించేందుకు ఇతరులను ప్రేరేపించదని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని క్షుణ్ణంగా సమీక్షించాలని, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎలా జరిగిందో చూసి, ఆపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Thandel Trailer: తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్.. నాగచైతన్య మాస్ ట్రీట్ రెడీ!
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!