బెంగళూరు శ్రీరాంపురలోని పోలీస్ యార్డులో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల్లో 130 ద్విచక్ర వాహనాలు, పది ఆటోలు, పది కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
కాంగ్రెస్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు.
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణకు చెందిన కార్మికుడి సహా తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పని దినాలు గురించి చర్చలు జరుగుతున్న వేళ యూకే కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వారానికి నాలుగు రోజులే పని దినాలుగా ప్రకటించాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్యాచార కేసులో నిజం ఓడిపోయింది. అబద్ధం గెలిచింది. తాజాగా ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరిచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. చివరి వరకు గ్రీన్‌లోనే కొనసాగాయి.
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం రూ.16,300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళలే లక్ష్యంగా వరాలు జల్లులు కురిపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేశారు.
ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక దేవాలయంలోకి పొట్టి స్కర్టులు లేదా శరీరం కనిపించే విధంగా దుస్తులు ధరించే భక్తులను అనుమతించబోమని మంగళవారం సిద్ధివినాయక్ గణపతి ఆలయ ట్రస్ట్ ప్రకటించింది.