శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేకుంటే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
బిల్డర్స్‌కు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు.
విశాఖలో నవ వధువు వసంత అనుమానాస్పద మృతి కేసులో భర్త అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక నాగేంద్ర మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జనసేన నేత కిరణ్ రాయల్‌పై లక్ష్మిరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్‌కు అక్రమ సంబంధం ఉంది. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడు. దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే. అ మహిళతో ఉన్న వీడియో, ఫొటోలు నా దగ్గర ఉన్నాయి.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు.
ఎండాకాలం సమీపించింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
రష్యాలోని నైరుతి సైబీరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అల్టాయ్ రిపబ్లిక్‌లోని అక్తాష్ సమీపానికి ఆగ్నేయంగా దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.