ఎండాకాలం సమీపించింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: UP: పెళ్లికి వెళ్లే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ.. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య
మరోవైపు డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచేందుకు కంపెనీలు కూడా సిద్ధపడుతున్నాయి. తెలంగాణలో మొత్తం 13 సంస్థలు బీర్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు షిఫ్టుల్లో కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో మూడు షిఫ్టుల్లో భారీగా ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఒక్కో కంపెనీ రోజుకు 2 లక్షల బీర్లను తయారు చేసి మద్యం షాపులకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pradeep Ranganathan: హీరోగా నన్ను చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు..