Hamas-Trump: శనివారం మ.12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదన్న ట్రంప్
- దగ్గర పడుతున్న హమాస్‌కు విధించిన గడువు
- శనివారం మ.12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు. ఒకవేళ విడుదల చేయకపోతే.. నరకం చూస్తారని హెచ్చరించారు. ట్రంప్ తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా స్పందిస్తూ.. తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor: ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ కపూర్..!
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఇదే అంశంపై శుక్రవారం ట్రంప్ స్పందిస్తూ.. శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. బందీల విడుదలకు తాను విధించిన గడువు దగ్గర పడుతుందని గుర్తుచేశారు. ‘‘శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదు.. చాలా కఠినమైన వైఖరి తీసుకుంటాను. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో కచ్చితంగా తాను చెప్పలేను.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవల విడుదలైన బందీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.. ముందున్న చిత్రాలకు.. ఇప్పుడున్న వారి పరిస్థితి చూస్తుంటే కృశించిపోయినట్లు కనిపించారు. ఇది హృదయ విదారకంగా ఉంది.’’ అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Donald Trump : ట్రంప్, మస్క్ నిర్ణయం కారణంగా రోడ్డున పడ్డ 10వేల మంది
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోందని.. ఇలాగైతే బందీలను విడుదల చేయబోమని హమాస్ హెచ్చరించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హెచ్చరించారు. లేదంటే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లు జోర్డాన్, ఈజిప్ట్‌లకు వెళ్లిపోవాలన్నారు. గాజాను పునర్ నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండించాయి. దీనిపై అరబ్ దేశాలు శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు గాజా పాలస్తీనీయులదేనని చైనా వ్యాఖ్యానించింది.
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. ఏడాదికి పైగా హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేయడంతో గాజా పట్టణం సర్వనాశనం అయింది. అయితే ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా ఒప్పందం జరగడంతో కాల్పులకు విరామం దొరికింది. మరోసారి ఈ వివాదం ముదురుతోంది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. హమాస్ ఏం చేస్తుందోనన్న సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
ఇది కూడా చదవండి: Rukshar Dhillon : గుబులు పుట్టిస్తున్న రుక్సర్ థిల్లాన్ స్టన్నింగ్ ఫోజులు..
- Tags
- GAZA
- Hamas
- IDF
- Israel
- Trump warns
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!