భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. దానికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది.
భూమ్మీద భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా కలకాలం జీవించేదే వివాహ బంధం. ప్రియుడి మోజులో పడి భర్తల ప్రాణాలు తీసే ఈరోజుల్లో.. తన భర్త అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ ఇల్లాలు అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతుండడంతో మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
పార్లమెంట్లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఫలితాలు వచ్చి 6 రోజులు అవుతున్నా.. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యాకు సంబంధించిన భూభాగాలు అప్పగించాలంటూ ట్రంప్ సూచించారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి.
క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు 2024 సవరణ బిల్లుపై నివేదికను ‘జేపీసీ’ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) గురువారం రాజసభలో సమర్పించింది.