బిల్డర్స్‌కు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బిల్డర్స్‌కు సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Valentine Day 2025 : లవర్స్ డే రోజు ప్రేమికుల మధ్య గొడవ.. తనపై కోపంతో బుల్లెట్ కు నిప్పు
ఇక హైదరాబాద్‌లో డీజిల్ వాహనాలను దశలవారీగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. మూసీ పునర్జీవానికి ముందుకు పోతామని.. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Samantha: ఈ విషయంలో జగ్రతపడకుంటే భర్తని కోల్పోవాల్సి వస్తుంది: సమంత