రష్యాలోని నైరుతి సైబీరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అల్టాయ్ రిపబ్లిక్‌లోని అక్తాష్ సమీపానికి ఆగ్నేయంగా దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఇది కూడా చదవండి: Rukshar Dhillon : గుబులు పుట్టిస్తున్న రుక్సర్ థిల్లాన్ స్టన్నింగ్ ఫోజులు..
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం ఫిబ్రవరి 15, 2025 శనివారం రష్యాలోని నైరుతి సైబీరియాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో సంభవించినట్లుగా పేర్కొంది. భూకంపం కారణంగా సమీప ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025 : మహా కుంభమేళాలో ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు.. సరికొత్త రికార్డు