కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిరిండియా విమానంలో చేదు అనుభవం ఎదురైంది. భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియాలో ప్రయాణించారు. అయితే కేంద్రమంత్రికి ఒక విరిగిపోయిన సీటును కేటాయించారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి నెలలో మారిషస్‌లో పర్యటించనున్నారు. మార్చి 12న మారిషస్ 57వ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలమ్ వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.
ఏపీలో ఫిబ్రవరి 23న (ఆదివారం) జరిగే గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం అయింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తుందని రేవంత్‌రెడ్డి అనడం దారుణం అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు
విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్‌పై మాచవరం పోలీసులు దాడి చేశారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9 ( స్పా) సెంటర్‌పై సహచర సిబ్బందితో కలిసి మాచవరం సీఐ ప్రకాష్ దాడులు చేశారు.
కేరళలో ఓ బ్యూరోక్రాట్ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఏమైందో... ఏమో తెలియదు గానీ... ఇద్దరు ఉరివేసుకుని ఉండగా.. వృద్ధురాలి మంచంపై శవమై కనిపించింది.
ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక... చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.
కడప కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కడప ఎమ్మెల్యే మాధవి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే కంప్లంట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. తాజాగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.