చిన్న చిన్న కారణాలకే కొందరు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కళ్లు తెరిచి చూసేలోపే అంతా చీకటైపోతుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు కారణంగా శుక్రవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం చీలికల దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ‘వై’ భద్రతను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అలాగే ఉప రాష్ట్రపతి ధన్కర్ను కూడా కలిశారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత ప్రధాని మోడీ తనకు పెద్దన్న లాంటివారని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది.
21వ శతాబ్దంలో జన్మించిన తరం ‘అమృత తరం’ కానుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆమె అస్వస్థతకు గురయ్యారు.
బెంగళూరు ట్రాఫిక్‌పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ట్రాఫిక్‌ను దేవుడు కూడా రాత్రికి రాత్రే మార్చలేడు అని వ్యాఖ్యానించారు. గురువారం ఓ ప్రారంభోత్సవంలో శివకుమార్ మాట్లాడుతూ.. దేవుడు కూడా బెంగళూరును వెంటనే మార్చలేడని పేర్కొన్నారు.