ఢిల్లీ అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది. బీజేపీ ప్రభుత్వం.. శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
మహా కుంభమేళా మరో రికార్డ్ సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాదాపు అగ్ర రాజ్యం అమెరికా జనాభా కంటే రెండు రెట్లు అధికంగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.
మహా కుంభమేళా మరో రికార్డ్ సృష్టించబోతుంది. ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసి రికార్డ్ సృష్టించగా.. తాజాగా ఒకేసారి 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ చేపట్టారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వైద్యులపై కరుణ చూపించారు. ఒకేసారి భారీగా జీతాలు పెంచారు. ప్రభుత్వ వైద్యులకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.
దక్షిణ కొరియాలోని అన్సియోంగ్లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన హఠాత్తుగా కూలిపోయింది. కూలిపోయిన దృశ్యాలు డాష్ క్యామ్ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గంగా మాత ఆశీస్సులు పొందడానికి వచ్చినట్లు తెలిపారు.
ఎన్నికలప్పుడే ప్రధాని మోడీకి బీహార్ రాష్ట్రం గుర్తుస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సోమవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్.. మోడీ టూర్‌ను ఉద్దేశించి 15 ప్రశ్నలు సంధించారు.