పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా సమాచారం అందుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుతున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ‘కుట్ర’ జరుగుతుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలో ఊబకాయంపై పోరాటం చేసేందుకు ప్రధాని మోడీ సంకల్పించారు. ఆదివారం మన్ కీ బాత్ వేదికగా ఊబకాయంపై పోరాటం చేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆహారంలో నూనెల వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోడీ నామినేట్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేఖా గుప్తా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
భోపాల్‌లో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడారు.. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు. రెండో విడత పాలనలో ట్రంప్ చర్యలు మరింత స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ముందుగా చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 11.28 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పటి దాకా 42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు
పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన చేసింది. స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని.. దీంతో దేహం చికిత్సకు సహకరించడం లేదని పేర్కొంది. గొట్టం ద్వారా ఆక్సిజన్ అందుతోందని తెలిపింది. పోప్ మంచి దృక్పథం కలిగిన వ్యక్తిగా వాటికన్ అభివర్ణించింది.
ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత రేఖ గుప్తా శనివారం మోడీని కలిశారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ను కూడా ముఖ్యమంత్రి కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.
హమాస్.. మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. ఇద్దరు బందీలను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. తాల్ షాహమ్, అవెరు మెంగిస్తులను రెడ్ క్రాస్ అధికారులకు అప్పగించారు. ఇజ్రాయెల్ బందీ తాల్ షోహమ్ను విడుదల సమయంలో వేదికపైన హమాస్ నడిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.