కేరళలో ఓ బ్యూరోక్రాట్ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఏమైందో… ఏమో తెలియదు గానీ… ఇద్దరు ఉరివేసుకుని ఉండగా.. వృద్ధురాలి మంచంపై శవమై కనిపించింది. మృతదేహాలు దుర్వాసన కొడుతున్నాయి. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డైరీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Train Derailment in Odisha: పట్టాలు తప్పిన రైలు.. ప్రమాదంలో దెబ్బతిన్న మూడు బోగీలు
మనీష్ విజయ్.. కేరళలోని సెంట్రల్ ఎక్సైజ్ మరియు జీఎస్‌టీ అదనపు కమిషనర్‌గా పని చేస్తున్నారు. సోదరి షాలిని, తల్లి శంకుతల ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. మనీష్ విజయ్, షాలిని వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఉండగా.. తల్లి శకుంతల మంచంపై చనిపోయి ఉంది. తెల్లటి గుడ్డ చుట్టి పూలతో చుట్టబడి ఉంది. అంటే తల్లి ముందే చనిపోయిందా? లేదంటే చంపబడిందా? అన్నది అనుమానం. అనంతరం మనీష్ విజయ్, షాలిని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మనీష్ విజయ్ నాలుగు రోజుల నుంచి డ్యూటీకి రాకపోవడంతో సహచరులు.. ఇంటికి వచ్చేటప్పటికి దుర్వాసన కొడుతోంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. ముగ్గురు శవాలుగా కనిపించారు. ఈ విధంగా దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.
కొచ్చి పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య మాట్లాడుతూ.. చాలా రోజుల క్రితం చనిపోవడంతో మృతదేహాలు కుళ్లిపోయాయని.. ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే.. ఎలా చనిపోయారో చెప్పగలమని అన్నారు. ఒక గదిలో డైరీని గుర్తించినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న రక్తసంబంధికి సమాచారం తెలియజేయాలని రాసి ఉంది. దీంతో సమాచారాన్ని విదేశాల్లో ఉన్న బంధువుకు కబురు అందించారు.
జార్ఖండ్‌కు చెందిన ఈ కుటుంబం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కక్కనాడ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటుంది. మనీష్ విజయ్.. గతంలో కోజికోడ్ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్‌లో పనిచేశాడు. అనంతరం ఏడాదిన్నర క్రితం కొచ్చికి బదిలీ అయ్యాడు. తల్లి, సోదరి కొన్ని నెలల క్రితం నుంచి అతనితో కలిసి ఉంటున్నారు.
ఇక షాలిని జార్ఖండ్‌లో ఒక చట్టపరమైన కేసును ఎదుర్కొంటోంది. దీని కోసం మనీష్ సెలవు కూడా తీసుకున్నాడు. 2006 జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో షాలిని మొదటి స్థానంలో నిలిచింది. డిప్యూటీ కలెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. అయితే ఆమె ర్యాంకుపై సవాల్ చేసిన తర్వాత సర్వీసు నుంచి తొలగించారు. 2024లో ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ప్రాణాలు పోయాయి.
ఇక విదేశాల్లో ఉన్న రక్తసంబంధి వచ్చాకే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Odela 2: అదిరిపోయిన ‘ఓదెల 2’ టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో