ఏపీలో ఫిబ్రవరి 23న (ఆదివారం) జరిగే గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23న యథావిధిగా గ్రూప్-2 మెయిన్ పరీక్ష జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. రేపటి పరీక్ష వాయిదా పడిందంటూ హల్‌చల్ అవుతున్న ఫేక్ వార్తపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..
రేపు ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫేక్ వార్తలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించింది. ఇక అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్చరించారు.