కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిరిండియా విమానంలో చేదు అనుభవం ఎదురైంది. భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియాలో ప్రయాణించారు. అయితే కేంద్రమంత్రికి ఒక విరిగిపోయిన సీటును కేటాయించారు. దీంతో ఆయన కూర్చోవడానికి అసౌకర్యానికి గురయ్యారు. తాజాగా ఇదే అంశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎయిరిండియా విమానంలో ఎదురైన దారుణమైన పరిస్థితిని వివరించారు. టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న తర్వాత సేవలు మెరుగుపడతాయని ఆశించాను కానీ.. ఏ మాత్రం బాగుపడలేదని ఇప్పుడు అర్థమైందన్నారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka : ఫైనల్‌గా బీసీ జనాభా 56 శాతం.. సర్వే పకడ్బందీగా జరిగింది
‘‘నేను భోపాల్ నుంచి ఢిల్లీకి వచ్చి.. పూసాలో కిసాన్ మేళాను ప్రారంభించాల్సి వచ్చింది. కురుక్షేత్రలో సహజ వ్యవసాయ మిషన్ సమావేశం నిర్వహించి. చండీగఢ్‌లోని కిసాన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో చర్చించాల్సి వచ్చింది. నేను ఎయిర్ ఇండియా విమానం నంబర్ AI436లో టికెట్ బుక్ చేసుకున్నాను. నాకు సీటు నంబర్ 8C కేటాయించారు. నేను వెళ్లి సీటుపై కూర్చున్నాను. సీటు విరిగిపోయి కూరుకుపోయింది. కూర్చోవడం అసౌకర్యంగా ఉంది.’’ అని చౌహాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తనకు కేటాయించిన సీటు గురించి ఎయిర్‌లైన్ సిబ్బందిని అడిగినప్పుడు.. సీటు పరిస్థితి గురించి యాజమాన్యానికి తెలుసని, ఆ సీటు టికెట్ అమ్మకూడదు అని వారు చెప్పారని ఆయన అన్నారు. ఇతర ప్రయాణికుల సీట్లు కూడా అలానే ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత మంచి సీట్లు కేటాయించాలని తెలియదా? అని చౌహాన్ ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఏ ప్రయాణికుడికి ఇలాంటి ఇబ్బంది ఎదురవ్వకూడదని సంస్థను కోరారు. అయితే కేంద్రమంత్రికి కలిగిన అసౌకర్యానికి ఎయిరిండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. దీనికి హామీ ఇస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Odela 2: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఓదెల2 టీజర్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
आज मुझे भोपाल से दिल्ली आना था, पूसा में किसान मेले का उद्घाटन, कुरुक्षेत्र में प्राकृतिक खेती मिशन की बैठक और चंडीगढ़ में किसान संगठन के माननीय प्रतिनिधियों से चर्चा करनी है।
मैंने एयर इंडिया की फ्लाइट क्रमांक AI436 में टिकिट करवाया था, मुझे सीट क्रमांक 8C आवंटित हुई। मैं जाकर…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 22, 2025