తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తుందని రేవంత్‌రెడ్డి అనడం దారుణం అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలను, రైతులను దోపిడీ దొంగలుగా చిత్రీకరించడం దారుణం అని.. ఒక సీఎంగా ఉండి ఇలా మాట్లాడడం సహేతుకమేనా? అని నిలదీశారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం ఎవరి త్యాగాలతో నిర్మించారో రేవంత్ రెడ్డికి తెలియదా? అని అడిగారు.
ఇది కూడా చదవండి: Nani: చిరంజీవి,ఓదెల కాంబో మూవీపై అప్డేట్ ఇచ్చిన నాని
‘‘ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఏపీ తన కాళ్ల మీద నిలబడుతుంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ నిధులు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఏపీ, తెలంగాణ మధ్య కావాలనే జల వివాదాలు సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి బేషరతుగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపుతారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా?, అయినా దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది. దేశంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతుంది.’’ అని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: కనకం… కనికరమే లేదా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎతంటే?