దేశ రాజధాని ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీం బాబా భార్య జోయా ఖాన్ (33)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి 270 గ్రాముల హెరాయిన్‌ను సాధీనం చేసుకున్నారు. హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దుండగులు దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యక్రమానికి స్కూటర్‌పై వెళ్తుండగా ముసుగులు ధరించిన ఆగంతకులు బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలోన్ మస్క్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం నియమించింది.
ఢిల్లీలో ప్రధాని మోడీని యూకే మాజీ ప్రధాని రిషి సునక్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మోడీతో రిషి సునక్ ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాంలీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షంతో పాటు హిమపాతం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఒక్కరోజు లాభాలకు బ్రేక్ పడింది. గత ఎనిమిది రోజులుగా భారీ నష్టాలు చవిచూడగా సోమవారం కాస్త ఊరట లభించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి నష్టాలను ఎదుర్కొంది.