ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి నెలలో మారిషస్‌లో పర్యటించనున్నారు. మార్చి 12న మారిషస్ 57వ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలమ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Venkatesh: టెలివిజన్ ప్రీమియర్ సందడి చేయనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
మోడీ పర్యటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు వేదిక అవుతుందని తెలిపారు. ప్రపంచ అధినేతల్లో మోడీ కూడా ఒకరని.. బిజీ షెడ్యూల్‌లోనూ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నామని నవీన్ రామ్‌గూలమ్ తెలిపారు. మార్చి 11 నుంచి మార్చి 12 వరకు మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం జాతీయ అసెంబ్లీలో మారిషస్ ప్రధానమంత్రి రామ్‌గూలమ్ మాట్లాడారు. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భారత ప్రధాని మోడీ మారిషస్‌కు వచ్చేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ఇంతటి విశిష్ట వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం మారిషస్‌కు దక్కిన ఏకైక గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bank Holidays in March 2025: మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను ప్రదానం చేసింది.ఇటీవలే ప్రధాని మోడీ రెండు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లారు. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక.. తొలిసారి మోడీ అమెరికాలో పర్యటించారు. ట్రంప్‌తో సమావేశం అయి అనేక అంశాలపై చర్చించారు.
#WATCH | In the National Assembly, Prime Minister of Mauritius, Dr Navinchandra Ramgoolam says "In the context of the celebrations of the 57th anniversary of the Independence of our country, I have great pleasure to inform the House that following my invitation, Prime Minister… pic.twitter.com/qtxZIQOV5z
— ANI (@ANI) February 22, 2025