ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమతో ఓ భర్త.. అర్ధాంగి కోసం లగ్జరీ కారు కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే కారుతో తన భార్య ఎంతో సంతోషిస్తుందని భావించాడు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. భాగస్వామికి గిఫ్ట్ నచ్చలేదు. అంతే తన భార్యకు నచ్చనిది తనకు నచ్చదని రూ.27లక్షల ఖరీదైన లగ్జరీ కారును డింపింగ్ యార్డ్‌లో పడేశాడు.
ఆమె.. మాజీ ప్రపంచ ఛాంపియన్. ఇండియన్ నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత. ఆమెనే సావీటీ బూరా. దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఈమెకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తన భర్త, అత్తింటి వారు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి వాడీవేడీగానే జరుగుతోంది. ఇటీవల గత ప్రభుత్వ పాలనపై కాగ్ రిపోర్టును ముఖ్యమంత్రి రేఖా గుప్తా సభలో ప్రవేశపెట్టారు.
మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతేకాకుండా కోట్లలో బిజినెస్ కూడా నడిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా సంచలన ఆరోపణలు చేశారు. ఐఐటీ రాంచీ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తున్న సమయంలో హ్యాక్ చేసి పోర్న్ వీడియో ప్రదర్శించారని తీవ్ర ఆరోపణల చేశారు.
పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున పూణెలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతి(27)పై యువకుడు (36) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి ఇళ్లల్లో పని చేసే కార్మికురాలు. యథావిధిగా బస్సు ఎక్కేందుకు వస్తే.. వేరే చోట ఉందని మాయమాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా ఈ ఉత్సవం ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. ఫిబ్రవరి 26తో విజయవంతంగా ముగిసింది. దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ఆధారంగా వక్ఫ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన చాలా మార్పులను కేంద్రం చేర్చినట్లుగా సమాచారం.
ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది.