డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఎం రాఘవులు తప్పుపట్టారు. అమిత్ షా చాలా మోసపూరితంగా మాట్లాడారన్నారు. బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..? అని నిలదీశారు.
దేశ వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1797 నుంచి 1803కి చేరింది.
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్లో మధ్యాహ్నంలోపు మృతదేహాల వెలికితీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మహదేవపూర్ మండలంలోని ఏన్కపల్లి అడవుల నుంచి ప్రతాపగిరి అడవుల వైపు పెద్దపులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం పడడంతో ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం అల్లకల్లోలం అయిపోయింది. ట్రంప్ నిర్ణయాలు కారణంగా మన మార్కెట్ కుదేలైపోయింది. వాణిజ్య యుద్ధ భయంతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొంది. దీంతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం వేసింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు భారీ హిమపాతం.. దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది. ఎటుచూసినా భారీగా మంచు పేరుకుపోయింది. అయితే చమోలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకుని 57 మంది కార్మికులు సమాధి అయ్యారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని అన్నా రోడ్డులో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందంటూ ఒక్కసారిగా ఐదు అంతస్తుల భవనం నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో అన్నా రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.