హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్బర్గ్(39) అనుమానాస్పద స్థతిలో మృతిచెందారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ అపార్ట్మెంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. మూడేళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించింది.
కర్ణాటక రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న అవినీతి కేసులో విచారణను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
మహా కుంభమేళా బుధవారంతో ముగుస్తోంది. దీంతో చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదానికి గురైంది.
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమితో సహా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు కొన్ని నెలలే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కేబినెట్ విస్తరణకు సిద్ధమైనట్లు పేర్కొ్న్నారు.
కాన్ఫిడెంట్‌గా ఉండండి వచ్చే ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే)దే విజయం అని ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్ అన్నారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు విజయ్, ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు.
తన ఆలోచనలు, వ్యూహాలు విజయ్‌కు అవసరం లేదని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి.
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ మేరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది. లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
దేశ ప్రజలకు ప్రధాని మోడీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో ప్రత్యేక వీడియోను మోడీ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని చూపించారు.
మొత్తానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు-ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుండగా.. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది.
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం 8:50 గంటలకు చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి వచ్చేశాయి.