ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలతో సహా ఇతర రాష్ట్రాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఇక గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్నాయి. బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఇక జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
ఇది కూడా చదవండి: Dhanush : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఉత్తర పాకిస్తాన్, దాని పరిసర ప్రాంతాల్లో పశ్చిమ దిశలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపా: జోగిమణి
VIDEO | Jammu and Kashmir: Rajouri witnesses rains and lightning.
Kashmir has experienced a mostly dry winter this year, with January and February recording a precipitation deficit of around 80 percent.
However, the wet weather spell, along with the forecast of more… pic.twitter.com/s41iLhwdsc— Press Trust of India (@PTI_News) February 27, 2025