ఆమె.. మాజీ ప్రపంచ ఛాంపియన్. ఇండియన్ నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత. ఆమెనే సావీటీ బూరా. దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఈమెకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తన భర్త, అత్తింటి వారు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆసియాడ్ కాంస్య విజేత, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడాపై, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Mokshagna : మళ్లీ మొదటికొచ్చిన మోక్షజ్ఞ సినిమా..?
సావీటీ బూరా, దీపక్ హుడా 2022లో వివాహం చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 25న హర్యానాలోని హిసార్‌లో దీపక్ హుడా వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని బూరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు హిసార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సీమా గురువారం తెలిపారు. హుడాకు 2-3 సార్లు నోటీసులు ఇచ్చామన్నారు. కానీ అతను హాజరు కాలేదని తెలిపారు. గాయం కారణంగా తన ఆరోగ్యం దెబ్బతిందని గైర్హాజరయ్యారని సమర్థించుకున్నట్లు సీమా చెప్పారు. మెడికల్ సర్టిఫికెట్ సమర్పించానని.. తర్వాత కలుస్తానని చెప్పినట్లు హుడా తెలిపారు. తన భార్యపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. దీనిపై బూరా కూడా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Warangal: డాక్టర్ హత్యయత్నం కేసు.. ప్రియుడితో కలసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య..
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్‌తక్ జిల్లాలోని మెహం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా హుడా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం హుడా గెలుచుకున్నారు. భారత కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే లగ్జరీ కోసం ఇరువురి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద కేసు నమోదు చేయబడింది.
ఇది కూడా చదవండి: Joe Root: ఓటమి అంటే ఆ మాత్రం బాధ ఉంటది! స్టేడియంలోనే ఏడ్చేసిన జో రూట్