ఢిల్లీలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గత ఆప్ ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీలో కాగ్ రిపోర్టులను బీజేపీ బహిర్గతం చేస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బయటపెట్టారు.
శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్‌పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.
కేంద్రం-కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మరోసారి కేంద్రానికి పిట్రోడా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. ఫిబ్రవరి 1న ఐఐటీ-రాంచీ విద్యార్థులు, అధ్యాపకులతో వర్చువల్‌గా శామ్ పిట్రోడా ప్రసంగిస్తున్నారు.
పుణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. మహారాష్ట్రలోనే అతి పెద్ద బస్సు డిపోల్లో పుణెలోని స్వర్గేట్ బస్సు డిపో ఒకటి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. భారీ జనసందోహం తిరిగి ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో యువతి (26)పై రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న అధికారికంగా కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా ఉత్సవం జరిగింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు.. దాదాపు 45 రోజులు నిర్వహించారు. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు కూడా నడిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో ఈ వారమంతా ఇలానే ట్రేడ్ అయింది.
అమెరికాలో చావుబతుకల మధ్య కొట్టిమిట్టాడుతున్న భారతీయ విద్యార్థిని నీలం షిండేను కలిసేందుకు తల్లిదండ్రులకు అత్యవసరంగా అమెరికా రాయబార కార్యాలయం వీసా మంజూరు చేసింది. దీంతో నీలం షిండే పేరెంట్స్.. అమెరికా వెళ్లనున్నారు.
పూణె అత్యాచార నిందితుడు దత్తాత్రయ రాందాస్(36) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 75 గంటల పోలీసుల వేట తర్వాత దొరికిపోయాడు. నిందితుడి కోసం దాదాపు 13 పోలీస్ బృందాలు వేటాడాయి. పూణె సమీప ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వేటాడారు. డ్రోన్లు, డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు చేపట్టారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి.