నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహోద్యోగి బుచ్ విల్మోర్ అంతరిక్ష యాత్ర ముగిసింది. తొమ్మిది నెలల అంతరిక్ష యాత్ర మరికొన్ని గంటల్లో ముగియనుంది. కొన్ని గంటల్లోనే భూమికి చేరుకోనున్నారు. ఈ మేరకు నాసా కీలక ప్రకటన విడుదల చేసింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు-రష్యాతో చర్చలు జరుపుతున్నారు. మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను అమెరికా కోరింది. దీనికి ఉక్రెయిన్ సానుకూల సంకేతాలు ఇవ్వగా.. రష్యా నుంచి మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదు.
తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంకోవైపు అధికార డీఎంకే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా పోరాటం చేస్తోంది. తమపై హిందీ భాష బలవంతంగా రుద్దుతోందని నిరసన గళాన్ని రేపుతోంది. ఇలా అధికార-విపక్షాల మధ్య రాజకీయ వార్ మొదలైంది.
ప్రసిద్ధ బాలనటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రివా అరోరా(18) ఇరకాటంలో పడింది. తనకు డాక్టరేట్ వచ్చిందంటూ ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసింది. ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 18 ఏళ్ల వయసులో డాక్టరేట్ ఏంటి? ఏ యూనివర్సిటీ? దేన్ని బట్టి పీహెచ్డీ ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గతేడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ వాదనను అతడి తల్లిదండ్రులు తోసిపుచ్చారు. కచ్చితంగా ఇదే హత్యేనని వాదించారు.
తమిళనాడులో ప్రస్తుతం భాషా వివాదం నడుస్తోంది. అధికార పార్టీ డీఎంకే హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ద్విభాషకే మద్దతు తెలిపింది. త్రిభాషా విధానాన్ని తప్పుపడుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం త్రిభాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావుకు సంబంధించిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం బెయిల్ పిటిషన్పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం ఎదుట అధికారులు ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడి స్నేహితుడు కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ యువ శాస్త్రవేత్త అభిషేక్ స్వర్ంకర్ (39) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పంజాబ్లోని మొహాలీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.