భారత సంతతి విద్యార్థిని కోనంకి సుదీక్ష చౌదరి (20) మిస్సింగ్ మిస్టరీగా మారింది. అమెరికాలోని వర్జీనియా నివాసి అయిన సుదీక్ష.. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. మార్చి 6న బీచ్‌లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా మాయం అయింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది.
జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. చైబాసాలోని జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పువాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు సజీవ దహనం అయ్యారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచార ఘటనలో బాధిత తల్లిదండ్రులకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఇటీవలే నిందితుడు సంజయ్ రాయ్‌కు కోల్‌కతా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదీ విధించింది.
బాలీవుడ్ సోషలైట్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి చిక్కుల్లో చిక్కుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ప్రాంతాన్ని పవిత్ర ప్రాంతంగా భక్తులు భావిస్తారు. అలాంటి స్థలంలో ఓర్రీ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. దీంతో ఓర్రీ సహా చట్టాన్ని ఉల్లంఘించిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. ఇక రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
పోప్ ఫ్రాన్సిస్(88)కు చెందిన తాజా ఫొటోను వాటికన్ విడుదల చేసింది. ఆస్పత్రిలో ఉన్న ఫొటోను ఆదివారం విడుదల చేసింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఫిబ్రవరి 14న రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన బాహ్య ప్రపంచానికి కనబడలేదు. తాజాగా పోప్‌కు సంబంధించిన ఫొటో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే వైద్యులు.. పలు రకాలైన టెస్టులు నిర్వహించారు. అనంతరం న్యుమోనియాకు డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వాటికన్ తెలిపింది. ఇది కూడా చదవండి: […]
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీతరెడ్డి (35), ఆమె కుమారుడు అరవింద్ (6), ఆమె అత్త సునీత (56)గా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
సుదీక్ష కోనంకి భారత సంతతి విద్యార్థిని. అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. బీచ్‌లో నడుస్తుండగా అకస్మాత్తుగా మార్చి 6న అదృశ్యమైంది. దీంతో ఆమె స్నేహితులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు.
యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్ పేరుతో యువతిని ట్రాప్ చేసి.. మోజు తీరాక నిందితుడు అంతమొందించాడంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నర్సు హత్యకు గురైందని మండిపడుతోంది.