భక్తుల పాలిట కొంగుబంగారమైన వనదేవతలు సమ్మక్క సారలమ్మల మహా జాతరకు మేడారం ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడారంలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మల దర్శనాలు బంద్ అయ్యియి.
Also Read:Off The Record: ఆ ఎంపీ.. ఎమ్మెల్యే పదవి కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేని హడలెత్తిస్తున్నారా..?
నేడు ఒక్కరోజు మేడారంలో సమ్మక్క-సారలమ్మల దర్శనాలు నిలిపివేయనున్నారు. గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటు గద్దెల విస్తరణపనుల నేపథ్యంలో పూజారులు బంద్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివాసి ఆచార సాంప్రదాయా పూజా విధానంతో పగిడిద్ద రాజు గోవిందా రాజు గద్దెల పునర్ ప్రతిష్ట పూజలు మొదలైనట్లు పూజారులు తెలిపారు. ఈ కారణంతో నేడు దర్శనాలు బంద్ చేయనున్నట్లు తెలిపారు. మేడారం వచ్చే భక్తులు ఇది గమనించాలని కోరారు.