2025 ఇయర్ ఎండింగ్‌కు వచ్చేశాం. టాలీవుడ్‌కు ఈ ఏడాదికి మిగిలింది ఈ ఒక్క వారమే. అందుకే ఈ వీకెండ్ టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్నాయి బోలెడు సినిమాలు. క్రిస్మస్ సీజన్‌లో యంగ్ హీరోలదే హవా అయినప్పటికీ వాళ్లతో పోటీకి రెడీ అయ్యారు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన వృషభ చివరకు డిసెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకునే సరికి కాంపిటీషన్ పీక్స్‌కు చేరింది. ఆది సాయి కుమార్ శంభాల, రోషన్ ఛాంపియన్ మధ్యే టఫ్ ఫైట్ అనుకుంటే.. సడెన్‌గా వృషభ వచ్చి చేరింది.
వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆది సాయి కుమార్‌కు శంభాల సినిమా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు ఆది. అలాగే పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ కూడా ఈ సినిమా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఈ సినిమాతో తన పొటెన్షియల్ ఏంటో ఫ్రూవ్ చేయాలనుకుంటున్నాడు. శివాజీ, నవదీప్, నందు, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషించిన దండోరా కూడా ఇదే రోజున రాబోతోంది.
డిసెంబర్ 12నే రావాల్సిన ఈషా.. బాలయ్య రేసులోకి వచ్చేసరికి డిసెంబర్ 25కి పోస్ట్ పోన్ చేసుకుంది. త్రిగుణ్, హెబ్బా జంటగా నటించిన ఈషా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ హారర్ మూవీతో ఆడియన్స్‌ను సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెడతామంటోంది మూవీ టీం. వీటితో పాటు పతంగ్ అనే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ కూడా క్రిస్మస్‌కే రాబోతోంది. ఇక సడెన్‌గా రేసులోకి వచ్చింది బ్యాడ్ గర్ల్స్. పేరు కాస్త తేడా ఉన్నా మంచి సందేశం ఇవ్వబోతోందట. కన్నడ మార్క్ కూడా అదే రోజు వస్తుందట. మరీ ఇన్ని సినిమాల్లో ఎవరు విన్ అవుతారో ఎవరు ఫట్ అవుతారో చూద్దాం.