ప్రసిద్ధ బాలనటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రివా అరోరా(18) ఇరకాటంలో పడింది. తనకు డాక్టరేట్ వచ్చిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసింది. ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 18 ఏళ్ల వయసులో డాక్టరేట్ ఏంటి? ఏ యూనివర్సిటీ? దేన్ని బట్టి పీహెచ్‌డీ ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Annamalai: ‘‘మూర్ఖపు స్టాలిన్’’.. ‘‘రూపాయి గుర్తు మార్పు’’పై అన్నామలై ఫైర్..
రివా అరోరా బాలనటిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఆది శంకర్ యూనివర్సిటీ నుంచి డిజిటల్ ఇన్‌ఫ్లయెన్స్ అండ్ ఉమెన్స్ ఎంపవర్‌మెంట్‌లో గౌరవ డాక్టరేట్ లభించిందని పేర్కొంది. ఎరుపు రంగు అకడమిక్ గౌన్ ధరించి పట్టా అందుకుంది. తన కల నెరవేరిందని.. అందుకు విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు పంచుకుంది.
ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. యూనివర్సిటీ విశ్వసనీయతను నెటిజన్లు శోధిస్తున్నారు. ఏ యూనివర్సిటీలో అలాంటి కోర్సే లేదని.. ఇక గూగుల్ సెర్చ్‌లో ఆ యూనివర్సిటీనే లేదని.. అలాంటప్పుడు కొత్తగా ఆ కోర్సు ఎక్కడ నుంచి వచ్చిందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు
ఒకవేళ ఆమెనే అఫ్లై చేసుకుందా? లేదంటే యూనివర్సిటీనే పిలిచి ఇచ్చిందా? అంటూ మరికొందరు నిలదీశారు. మొత్తానికి రివా అరోరా డాక్టరేట్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్ల సందేహాలకు రివా అరోరా ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే కర్ణాటకకు చెందిన రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. తాజాగా రివా అరోరా పీహెచ్‌డీ వివాదంలో పడింది.