Trump-Putin: ఈ వారంలో ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు జరిగే ఛాన్స్
- ఈ వారంలో ట్రంప్-పుతిన్ భేటీ అయ్యే ఛాన్స్
- యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను కోరనున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు-రష్యాతో చర్చలు జరుపుతున్నారు. మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను అమెరికా కోరింది. దీనికి ఉక్రెయిన్ సానుకూల సంకేతాలు ఇవ్వగా.. రష్యా నుంచి మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వారం కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు ఉంటాయని అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. ఇరువురి మధ్య చర్చల తర్వాత పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Hit3 : నాని ‘హిట్ 3’ కి ఓటిటి లో భారీ ధర !
Also Read
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
ఇదిలా ఉంటే అమెరికా-రష్యా మధ్య కూడా సంబంధాలు మెరుగుపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అలాగే రష్యా కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలని పుతిన్‌ను ట్రంప్ కోరనున్నారు. ఇక ఈ భేటీలో మరికొన్ని డిమాండ్లు.. ట్రంప్ ముందు పెట్టేందుకు పుతిన్ జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Tamil Nadu: డీఎంకే టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలు.. వైన్ షాపుల ముట్టడికి పిలుపు
గత మూడేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్‌లో చాలా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అలాగే అమెరికా మద్దతుతో ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. యుద్ధం ముగింపుపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు చర్చలు జరిగాయి. దాదాపు కొలిక్కి వస్తున్నట్లు సూచనలు కనిపిస్తు్న్నాయి. త్వరలో ట్రంప్-పుతిన్ భేటీ తర్వాత యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Weather Updates : తెలంగాణలో మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్
తాజావార్తలు
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!