నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరోసారి వాయిదా పడింది. స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగం వాయిదా పడటంతో భూమ్మీదకు తిరిగి రావడం ఆలస్యం కాబోతుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్లో నలుగురు వ్యోమగాముల సిబ్బంది ఉన్నారు.
డొమినికన్ రిపబ్లిక్లో మార్చి 6న తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి (20) ఆచూకీ ఇంకా లభించలేదు. వారం గడుస్తు్న్నా ఎలాంటి పురోగతి లభించలేదు. అధికారులు.. హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలతో జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు అడుగులు పడుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాలో రష్యాతో చర్చలు జరుగుపుతోంది. తొలుత తమ పాత్ర లేకుండా చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. తాజాగా శాంతి చర్చలకు ఓకే చెప్పింది.
బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన నటి రన్యారావు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా మంగళవారం రన్యారావు తరపున న్యాయవాది కిరణ్ జవాలి వాదనలు వినిపించారు. మార్చి 3న అరెస్టైన దగ్గర నుంచి రన్యారావును డీఆర్ఐ అధికారులు మానసికంగా వేధించారని.. ఆమెకు నిద్రలేకుండా చేశారని తెలిపారు.
హర్యానాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్‌కు ఎన్నికలు జరిగాయి.
ప్రస్తుతం తమిళనాడులో హిందీ వివాదం నడుస్తోంది. కేంద్రం బలవంతంగా తమిళనాడుపై హిందీ రుద్దుతోందని డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ ప్రారంభమైన దగ్గర నుంచి డీఎంకే సభ్యులు... ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు తమిళనాడులో త్రిభాషా ఉద్యమాన్ని బీజేపీ ప్రారంభించింది. ఇలా హిందీ వివాదం జాతీయ స్థాయిలో ఉద్రిక్తంగా సాగుతోంది.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీ నొప్పితో బాధపడ్డారు. దీంతో హుటాహుటినా ఆయన్ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు తరలించారు
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలు ఉన్నాయి.
నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటి దాకా డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ అధీనంలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించింది.
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష కోనంకి(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. అర్ధరాత్రి సమయంలో బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.